ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయటపెట్టారు?: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-03-07T13:50:50+05:30

‘‘పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా’’ పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘‘పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా’’ పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. చర్చలకు ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పిందని మండిపడ్డారు. పీఆర్సీఫై ఉద్యోగ సంఘాల నేతలను కూడా అప్రతిష్టపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందన్నారు. పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ఈ ఒప్పందం వల్ల దిగువశ్రేణి ఉద్యోగులు నెలకు రూ.4 వేలు చొప్పున నష్టపోయే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరోదఫా చర్చలు జరపాలని అన్నారు.  అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చి, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-03-07T13:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising