ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోస్తా.. భగభగ!!

ABN, First Publish Date - 2022-05-24T09:01:31+05:30

పడమర నుంచి వీచిన పొడిగాలులతో కోస్తా ప్రాంతం భానుడి భగభగలతో అట్టుడికిపోయింది. అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీయడంతో ప్రజలు విలవిల్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలుచోట్ల వడగాడ్పులు.. రాజానగరంలో 44.43 డిగ్రీలు 

విశాఖపట్నం, మే 23(ఆంధ్రజ్యోతి): పడమర నుంచి వీచిన పొడిగాలులతో కోస్తా ప్రాంతం భానుడి భగభగలతో అట్టుడికిపోయింది. అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీయడంతో ప్రజలు విలవిల్లాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత ఇబ్బంది పెట్టింది. వేడిగాలులు వీయడంతో అనేక ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్‌ ప్రకారం.. సోమవారం కోస్తాలోని 4 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 24 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 44.44, అనపర్తి, బిక్కవోలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, భారత వాతావరణ శాఖ బులెటిన్‌ మేరకు తునిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఉంటుందని, 28 వరకు గాడ్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

Updated Date - 2022-05-24T09:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising