ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన జీవీఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం

ABN, First Publish Date - 2022-03-04T21:17:04+05:30

విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ బడ్జెట్ సమావేశం ముగిసింది. జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌ సమావేశం శుక్రవారం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ బడ్జెట్ సమావేశం ముగిసింది. జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌ సమావేశం శుక్రవారం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూ.4,319.98 కోట్ల జీవీఎంసీ బడ్జెట్‌కి ఆమోద ముద్ర వేశారు. దీనికి స్టాండింగ్‌ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలపడంతో పాలకవర్గం ఆమోదం కోసం కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంశాలను మేయర్‌ సభ్యులకు చదివి వినిపించారు. సభ్యులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు బడ్జెట్‌లో మార్పులు, చేర్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు అధికారులకు మేయర్‌ ఆదేశాలు జారీచేస్తారు. 2022-23 బడ్జెట్‌లో ప్రారంభ నిల్వగా రూ.434.8 కోట్లు చూపించగా, అన్నిమార్గాల నుంచి రూ.3,885.18 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. వివిధ అవసరాలకు కేటాయింపులు కింద రూ.4,061.9 కోట్లు చూపించగా, ముగింపు నిల్వగా రూ.258.08 కోట్లు చూపించారు. అయితే టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. బడ్జెట్ అంతా అంకెల గారడి అంటూ ప్రతిపక్షాల విమర్శలు గుప్పించాయి. 

Updated Date - 2022-03-04T21:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising