ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan పర్యటనతో పోలీసుల అతి.. ప్రజలకు అష్టకష్టాలు

ABN, First Publish Date - 2022-04-28T12:35:42+05:30

CM Jagan పర్యటనతో పోలీసుల అతి.. ప్రజలకు అష్టకష్టాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా/వన్‌టౌన్‌ : వన్‌టౌన్‌లో ముసాఫిర్‌ ఖానా ప్రారంభించేందుకు సీఎం రావడమేమోగానీ ప్రజలు మాత్రం అష్టకష్టాలపాలయ్యారు. సీఎం రాకకు ముందు, ఆ తరువాత కూడా ఆ మార్గంలో వాహనాలను నిషేధించారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి పంజా సెంటర్‌ వరకు రోడ్లకు ఇరువైపులా టెంపరరీ రెయిలింగ్‌లను ఏర్పాటు చేశారు.


ఇప్పటికే రోడ్డు మరమ్మతుల కారణంగా కొన్ని రోజుల నుంచి కేటీ రోడ్డులో వన్‌ వేలో బస్సులను అనుమతిస్తున్నారు. సీఎం రాకతో ఆ ఒక్క మార్గంలో కూడా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణించేవారంతా తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే అదనుగా ఆటోవాలాలు చార్జీలు పెంచేశారు. సీఎం పర్యటన బందోబస్తు పేరుతో విజయవాడ పోలీసుల అతి జాగ్రత్తలపై ప్రజలు మండిపడ్డారు.

Updated Date - 2022-04-28T12:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising