సీఎం సాబ్.. బచావో!
ABN, First Publish Date - 2022-09-22T10:27:24+05:30
సీఎం సాబ్.. బచావో!
ఫీజుల కోసం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు
సీఎంకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మెసేజ్‌లు
వేంపల్లె, సెప్టెంబరు 21: ‘సీఎం సాబ్ బచావో’ అని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మొరపెట్టుకున్నారు. కరోనా కారణంగా 2020-2021 విద్యా సంవత్సరం నుంచి జగనన్న వసతి దీవెన సొమ్ము విద్యార్థులకు అందలేదు. అయినా ఈ మొత్తం చెల్లించాలని ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. వసతి దీవెనతో తమకు సంబంధం లేదని, విద్యార్థులే సొంతంగా చెల్లించాలని అధికారులు అంటున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈమేరకు వందల మంది విద్యార్థులు ట్విటర్ ద్వారా ముఖ్యమంత్రికి మెసేజ్‌లు పంపించారు.
Updated Date - 2022-09-22T10:27:24+05:30 IST