ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhaలో CM Jagan పర్యటన నేడు

ABN, First Publish Date - 2022-07-15T13:23:22+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Visakha): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాహన మిత్ర పథకం లబ్దిదారులకు రూ. 10 వేలు చొప్పున జమ చేయనున్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 61 వేల 516 మంది ఆటో, మ్యాక్సీ కాబ్ డ్రైవర్లకు రూ. 261 కోట్లు జమ చేయనున్నారు. విశాఖ జిల్లాలో 20,711 మంది డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేస్తున్నారు. నగర పరిధిలో 22,065 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల తరలింపునకు ఏర్పాట్లు చేశారు.


కాగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం విశాఖ నగరంలో ఒక బహిరంగ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ‘వాహనమిత్ర’ పథకం కింద ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేలు వంతున జమ చేసే కార్యక్రమాన్ని ఆయన మీటనొక్కి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు నగరానికి వచ్చినా బహిరంగ సమావేశంలో ఇప్పటివరకూ పాల్గొనలేదు. నేవీ మిలాన్‌ను హాజరైనప్పటికీ కేవలం నౌకాదళం పనితీరు, సేవలు గురించి మాత్రమే మాట్లాడారు. శుక్రవారం మాత్రం వాహన డ్రైవర్‌లను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.  ముఖ్యమంత్రి సభ కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేసింది. 

Updated Date - 2022-07-15T13:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising