నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటన
ABN, First Publish Date - 2022-10-17T10:24:12+05:30
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 9గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు
ఆళ్ల్లగడ్డ, అక్టోబరు 16: నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.10 గంటల వరకు పట్టణంలోని వైపీపీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం రెండో విడత రైతు భరో సా, మూడో విడత పీఎం కిసాన్ పథకం నిధులను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
సీఎం వస్తున్నారని పాఠశాలలకు సెలవు
సీఎం ఆళ్లగడ్డ పర్యటన నేపథ్యంలో మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ఉపయోగించనున్నారు.
Updated Date - 2022-10-17T10:24:12+05:30 IST