ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm Jagan Allert: కుప్పం వైసీపీ శ్రేణులతో భేటీ

ABN, First Publish Date - 2022-08-04T23:59:20+05:30

కుప్పం నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో (kuppam Mlas) సీఎం జగన్ (Cm Jagan) భేటీ అయ్యారు. సర్వే రిపోర్టుల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): కుప్పం నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో (kuppam Mlas) సీఎం జగన్ (Cm Jagan) భేటీ అయ్యారు. సర్వే రిపోర్టుల్లో అంతా రివర్స్ ప్రోగ్రెస్ చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి (Special Focus) పెట్టారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కుప్పం వైసీపీ కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. మూడేళ్ల తర్వాత క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలతో భేటీ అవుతుండడంపై ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలతో (Chittor District Mlas) సీఎం జగన్ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గడపగడపలో ప్రజల నుంచి వస్తున్న నిరసనలతో సీఎం జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.  దీంతో కొంతకాలంగా ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్లతో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Cm Jagan) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష నిర్వహిస్తుండడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. 


2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ మోహన్ రెడ్డి.. చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టించారు.  పాదయాత్రలో ఆ జిల్లాపై వరాలు జల్లు కురిపించారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంపై మరింతగా ఫోకస్ చేసి వ్యూహాలు అమలు చేశారు. అయితే కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గెలుపొందారు. 


ఇక జగన్ అధికారంలోకి రావడంతో లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక సీట్లు సాధించింది. కుప్పం మున్సిపాలిటీని కూడా ఆ పార్టీనే చేజిక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఎలాగైనా కుప్పం అసెంబ్లీ స్థానాన్ని కూడా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిపిన సర్వేల్లో వ్యతిరేకత వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అలెర్ట్ అయిన జగన్.. వైసీపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు తాజాగా వారితో భేటీ కావాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-08-04T23:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising