ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రేపు జగన్ కోనసీమ జిల్లా పర్యటన

ABN, First Publish Date - 2022-07-26T00:09:13+05:30

సోమవారం సీఎం జగన్ (CM Jagan) కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి వరద (Godavari flood) ప్రాంతాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సోమవారం సీఎం జగన్ (CM Jagan) కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి వరద (Godavari flood) ప్రాంతాల్లో బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరుతారు. 10.30 గంటలకు జి.పెదపూడికి చేరుకుంటారు. 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో బాధితులతో సమావేశమవుతారు. అనంతరం అరిగెలవారిపేట, తర్వాత ఉడిమూడిలంకలో బాధితులతో భేటీ అవుతారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.05 గంటలకు వాడ్రేవుపల్లి, మేకలపాలెంలో జగన్ పర్యటిస్తారు. సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో  చేరుకుంటారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాత్రికి రాజమండ్రి (Rajahmundry)లో జగన్ బసచేస్తారు. 


కోనసీమ (Konaseema) జిల్లా పి. గన్నవరం మండలం జి. పెద్దపూడి పరిసర లంక గ్రామాల్లో ఈ నెల 26న సీఎం జగన్ (Cm jagan) పర్యటించనున్నారు. ముందస్తుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Minister Chelluboina Venugopala Krishna)తో పాటు ప్రజా ప్రతినిధుల బృందం లంక గ్రామాల్లో పర్యటించింది. ఇంటింటికి వెళ్లారు. సీఎం వస్తున్నందున ఆయన ముందు ఏ విధంగా మాట్లాడాలనే అంశంపై మంత్రి వరద బాధితులకు శిక్షణ (Training) ఇచ్చారు. 

Updated Date - 2022-07-26T00:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising