ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: జగన్ సీబీఐ కేసులపై బాపట్ల జిల్లా పర్యటనలో పవన్‌ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-06-20T01:00:51+05:30

నేను ప్రజలకు దత్తపుత్రుడిని. సీఎం జగన్ (CM Jagan) మాత్రం కచ్చితంగా సీబీఐ (CBI)కి దత్తపుత్రుడే. భవిష్యత్లో జగన్ను సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల: ‘‘నేను ప్రజలకు దత్తపుత్రుడిని. సీఎం జగన్ (CM Jagan) మాత్రం కచ్చితంగా సీబీఐ (CBI)కి దత్తపుత్రుడే. భవిష్యత్లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) జోస్యం చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూరులో పవన్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించారు. పర్చూరు బహిరంగ సభలో బాధితులకు ఆర్థికసాయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన 80 రైతు కుటుంబాలకు సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా కౌలురైతులను గుర్తించడం లేదని, కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు పత్రాలు ఉండవని, సీఎం జగన్కు తప్ప అందరికీ ఈ విషయం తెలుసని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోవడమే వైసీపీ లక్షణమని తప్పుబట్టారు. ఉత్తర ప్రగల్భాలు పలకడమే వైసీపీ నైజంగా మారిందని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. 


‘‘వైసీపీ (YCP) నేతలు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, దాడి చేయొచ్చు కానీ.. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారు. వైసీపీ నేతలు అధికారమదంతో కొట్టుకుంటున్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ.. ఎలా ఊరుకుంటాం. ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఎందుకు జరుగుతాయో తెలుసా?.. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడని అంటున్నారు. అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వైసీపీ నేతలకు సంస్కారం లేదు’’ అని పవన్ మండిపడ్డారు.


చనిపోయిన ప్రతి రైతుకు బీమా పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.2 వేల కోట్లు ఇచ్చామంటున్నారు... ఎవరికి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అడిగేవారు ఎవరూ లేరనుకుంటున్నారు... కానీ ప్రశ్నిచేందుకు జనసేన (Janasena) ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వైసీపీ నేతలు బూతులు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.



Updated Date - 2022-06-20T01:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising