ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలసి పనిచేయండి.. పార్టీని ముందుకు తీసుకెళ్లండి

ABN, First Publish Date - 2022-03-05T07:28:32+05:30

అందరూ సమన్వయంతో పనిచేస్తూ, పార్టీని ముందుకు నడిపించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు 


మదనపల్లె, మార్చి 4: అందరూ సమన్వయంతో పనిచేస్తూ, పార్టీని ముందుకు నడిపించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. పనిచేసిన వారికే వచ్చే ఎన్నికల్లో   గుర్తింపు ఉంటుందని హితబోధ చేశారు. మదనపల్లె నుంచి వెళ్లిన నేతలు, కార్యకర్తలతో గురువారం పొలిట్‌బ్యూరో సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు మూడు బృందాలుగా మాట్లాడారు.మదనపల్లెలో పార్టీ బలహీనపడడానికి కారణాలు  అడిగి తెలుసుకున్నారు.ఈ సమాచారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఇన్‌ఛార్జి దొమ్మలపాటి రమేష్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరాంచినబాబు, బోడిపాటి శ్రీనివాస్‌, రాటకొండ బాబురెడ్డి, శ్రీరామ జయరాంనాయుడు పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలను వేర్వేరుగా కాకుండా అందరూ కలసికట్టుగా చేయాలని సూచించిన అధినేత, ఇన్‌ఛార్జిగా సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవాలని  రమే్‌షకు సూచించారు.మిగిలిన నాయకులు, కార్యకర్తలంతా ఇన్‌ఛార్జి కిందనే పనిచేయాలని  దిశానిర్దేశం చేశారు. ఇన్‌ఛార్జికే టికెట్‌ ఇస్తామన్న అపోహలు వీడాలని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, వారినే పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు.నిమ్మనపల్లె మండలంలో కార్యకర్తలు బలంగా ఉన్నా, నాయకుల్లో గ్రూపులతో పార్టీ దెబ్బతింటోందని కార్యకర్తలు అధినేత దృష్టికి తెచ్చారు. గ్రూపులు, వర్గాలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబు నేతలను ఘాటుగా హెచ్చరించారు.తెలుగుయువత అధ్యక్షుడు, కార్యకర్త దేవరింటి శ్రీనివాసులు మధ్య జరిగిన వివాదం ఆడియో రూపంలో సోషల్‌ మీడియాలో రావడంపై చంద్రబాబు అటు రమే్‌షను, ఇటు చినబాబును మందలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. 

Updated Date - 2022-03-05T07:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising