ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచి ఎవరు?

ABN, First Publish Date - 2022-05-21T08:32:04+05:30

మీరు సర్పంచి అని ఎప్పుడూ చెప్పొద్దని మొగరాలపల్లె సర్పంచ్‌ భర్తకు కలెక్టర్‌కు సూచించారు.

మొగరాలపల్లె రైతు భరోసా కేంద్రం వద్ద కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పంచి నేను.. కాదు, మా ఆవిడ

కలెక్టర్‌ ప్రశ్నకు ఇదీ జవాబు 


కలెక్టర్‌: మీరెవరు? 

ఓ వ్యక్తి: ఈ గ్రామ సర్పంచిని సార్‌ 

కలెక్టర్‌: మీరు సర్పంచా? 

సర్పంచి భర్త: కాదు.. మా భార్య సర్పంచి 

కలెక్టర్‌: అయితే, మీరు సర్పంచి అని ఎందుకు చెబుతున్నారు? అలా ఎప్పుడూ చెప్పొద్దు. 


..ఇదీ కలెక్టర్‌ హరినారాయణన్‌ పర్యటనలో భాగంగా గుడిపాల మండలం మొగరాలపల్లె రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వద్ద శుక్రవారం జరిగిన సంఘటన. ‘రైతులకు ప్రభుత్వం నుంచి యంత్రాలు, ఎరువులు అందుతున్నాయా? బయట మార్కెట్‌ ధరకు, ఆర్బీకే ధరలకు ఎంత వ్యత్యాసం ఉంది? మామిడి కాయలను రైతులు ఎక్కడకు తరలించి విక్రయిస్తున్నారు’ అని ఆర్బీకే సిబ్బందిని కలెక్టర్‌ అడగ్గా.. సర్పంచి భర్త సమాధానమిచ్చారు. అతడిని ఎవరని అడగడంతో సర్పంచినంటూ సర్పంచి భర్త చెప్పుకోవడం బయటకు వచ్చింది. అలాగే చీలాపల్లె సచివాలయం, ఆర్బీకే ని కూడా కలెక్టర్‌ పరిశీలించారు. ‘సారా తయారీ, విక్రయాలను ఎంత వరకు అదుపు చేశారు? ఎవరిపైన అయినా పీడీయాక్టు కేసులు పెట్టారా’ అని మహిళా పోలీసును ప్రశ్నించారు. మహిళా సంఘాల ద్వారా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు బాబురాజేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో పూర్ణచంద్రారెడ్డి, ఏవో మాధవి, పీఆర్‌ఏఈ జయచంద్రారెడ్డి, హౌసింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

- గుడిపాల

Updated Date - 2022-05-21T08:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising