ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలకోన సిద్ధేశ్వరుడి సన్నిధిలో ఇవేం పనులు?

ABN, First Publish Date - 2022-01-22T06:48:51+05:30

ప్రముుఖ శైవక్షేత్రాల్లో తలకోన సిద్ధేశ్వరస్వామి సన్నిధి ఎంతో పవిత్రమైందిగా భక్తులు భావిస్తారు. అటువంటి ప్రదేశానికి మాంసం, మద్యం తీసుకొచ్చి అపవిత్రం చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రశాంతత, చల్లదనం కారణంగా అన్ని మతాలవారు తలకోనకు వస్తుంటారు.

ప్రైవేటు భోజనశాలలో వండుతున్న మాంసం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాంసం, మద్యం తీసుకొచ్చి అపవిత్రం చేస్తున్నారని భక్తుల ఆవేదన


ఎర్రావారిపాళెం, జనవరి 21: ప్రముుఖ శైవక్షేత్రాల్లో తలకోన సిద్ధేశ్వరస్వామి సన్నిధి ఎంతో పవిత్రమైందిగా భక్తులు భావిస్తారు. అటువంటి ప్రదేశానికి మాంసం, మద్యం తీసుకొచ్చి అపవిత్రం చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రశాంతత, చల్లదనం కారణంగా అన్ని మతాలవారు తలకోనకు వస్తుంటారు. అప్పుడప్పుడు కొందరు గుట్టుచప్పుడు కాకుండా తమవెంట తెచ్చుకొన్న మాంసాహారాన్ని తినేవారన్నారు. ప్రస్తుతం అధికారుల అలసత్వం కారణంగా జులాయిలు, అన్యమతస్తుల వ్యవహార శైలి ఆలయ పవిత్రతకు గొడ్డలిపెట్టుగా తయారైందంటున్నారు. ఇక్కడున్న చిరు భోజనశాలలు, ప్రైవేటు వసతి గృహాలు.. మద్యం, మాంసంతోపాటు జల్సాలకు నిలయంగా మారాయని ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం ఏ చెట్టు కింద చూసినా మాంసాహారాన్ని వండుకుని తింటూ మద్యం తాగుతూ విందులు చేసుకోవడం మామూలై పోయిందని వాపోయారు. ఆలయ పరిసరాల్లో ఉన్న టీటీడీ సత్రాల ప్రాంగణంలోనే ఇటువంటి పనులు చేస్తున్నా.. అధికారులెవరూ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ అంశంపై నెరబైలు మాజీ సర్పంచ్‌ ధనపాల్‌ మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో మాంసం వండుకోవడం, తినడం మహాపాపమన్నారు. అధికారులు ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ సమీపంలో మాంసం, మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జయకుమార్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-22T06:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising