ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంతెంత‘దూరం’...!

ABN, First Publish Date - 2022-06-22T06:19:51+05:30

భుత్వం తీసుకున్న అవకతవక నిర్ణయాల్లో కుప్పం నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ప్రకటించిన బాలికల జూనియర్‌ కళాశాలలు గందరగోళాన్ని సృష్టించాయి. మండల కేంద్రాల్లో నడుస్తున్న కోఎడ్యుకేషన్‌ కాలేజీలను బాలికల కళాశాలలుగా మార్చేస్తూ వెలువడిన ఉత్తర్వులు నియోజకవర్గంలో కలకలం సృష్టిసు ్తన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పంలో బాలికల కళాశాలల ప్రకటనతో కలకలం


ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థి లోకం


కుప్పం, జూన్‌ 21: ప్రభుత్వం తీసుకున్న అవకతవక నిర్ణయాల్లో కుప్పం నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ప్రకటించిన బాలికల జూనియర్‌ కళాశాలలు గందరగోళాన్ని సృష్టించాయి. మండల కేంద్రాల్లో నడుస్తున్న కోఎడ్యుకేషన్‌ కాలేజీలను  బాలికల కళాశాలలుగా మార్చేస్తూ వెలువడిన ఉత్తర్వులు నియోజకవర్గంలో కలకలం సృష్టిసు ్తన్నాయి. ఇలా చేయడంవల్ల ఆయా మండలాల్లో దూరంగా ఉన్న గ్రామాలనుంచి బాలురు కళాశాలలకు రానూపోనూ ఏకంగా 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. 


న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ ప్రకారం మండలాల్లో బాలికల కళాశాలల ఏర్పాటు కుప్పం నియోజక వర్గంలో  సమస్యను జటిలంగా మార్చింది. నియో జకవర్గంలోని గుడుపల్లె, రామకుప్పం మండలాల్లో ఒక్కో కోఎడ్యుకేషన్‌ కళాశాలలున్నాయి. అక్కడ ఎటువంటి సమస్యా లేదు. కుప్పం మండలానికి సంబంధించి కుప్పం పట్టణంలో ఒకటి, మల్లా నూరులో మరో కోఎడ్యుకేషన్‌ కళాశాలలు నడుస్తు న్నాయి. ఇందులో కుప్పం పట్టణంలోని ఎంఎఫ్‌సీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బాలికల కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శాంతిపురం మండలంలో మఠంలో ఒకటి, రాళ్లబూదుగూరులో మరో  కోఎడ్యుకేషన్‌ కళాశాలలున్నాయి. మఠం కళాశాలను బాలికల కళాశాలగా మార్పు చేశారు.


80 కిలోమీటర్లు దూరం


వచ్చే విద్యా సంవత్సరంనుంచి బాలికల కళా శాలలుగా మార్పు చేయడంవల్ల వివిధ గ్రామాల నుంచి నాలుగు మండలాల్లోని ఏ కోఎడ్యుకేషన్‌ కళాశాలకు వెళ్లాలన్నా కనిష్ఠంగా పది కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 80 కిలోమీటర్ల దూరం రాపోకలు సాగించాల్సి ఉంటుంది.  విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత పాసులు ఇస్తున్నదని అనుకున్నా, ఆ బస్సులు కళాశాలల వేళలకు వచ్చే పరిస్థితులు లేవు. ఇక  పెరిగిన డీజీల్‌, పెట్రోలు ధరల నేపథ్యంలో ఆటో వాలాలు కూడా ఛార్జీలను అమాంతం పెంచేశారు. 


విద్యార్థుల్లో ఆందోళన


కుప్పం, శాంతిపురం మండలాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో చేరాల్సిన విద్యార్థులతోపాటు టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ రెండు మండలాల్లో కార్పొరేట్‌, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలున్నాయి కానీ, పేద విద్యార్థులు వందల సంఖ్యలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే చదువులు కొనసాగి స్తున్నారు. ఉన్నపళంగా మండల కేంద్రాల్లోని కోఎడ్యుకేషన్‌ కళాశాలలను బాలికల కళాశాలలుగా మార్పు చేయడంపట్ల వారిలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కాగా కుప్పంలోని ఎంఎఫ్‌సీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కోఎడ్యుకేషన్‌ కాలేజీగా ఉంచేసి పట్టణం నడిబొడ్డున ఉన్న జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలను బాలికల జూనియర్‌ కళాశాలగా మార్చే ప్రతిపాదనలు అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-06-22T06:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising