ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతరిక్షం పిలుస్తోంది.

ABN, First Publish Date - 2022-05-29T08:38:24+05:30

అంతరిక్ష పరిశోధన ఫలాలతోనే ప్రపంచం ముందుకు సాగుతుంది.... వ్యవసాయం, విద్య, వైద్య సమాచార తదితర రంగాలన్నీ సాంకేతిక విప్లవంతోనే పురోగమిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతరిక్ష పరిశోధన ఫలాలతోనే ప్రపంచం ముందుకు సాగుతుంది.... వ్యవసాయం, విద్య, వైద్య సమాచార తదితర రంగాలన్నీ సాంకేతిక విప్లవంతోనే పురోగమిస్తున్నాయి. మానవ మనుగడను మెరుగుపరుస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ స్పేస్‌ టెక్నాలజీని తెలుసుకోవాలంటూ ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు.అంతరిక్ష విజ్ఞానం వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు ఇస్రో నిర్వహిస్తోన్న యువిక ముగింపు కార్యక్రమాన్ని శనివారం   శ్రీహరికోట సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సోమనాథ్‌ మాట్లాడుతూ 1960వ దశకంలో విక్రమ్‌సారాబాయ్‌ దేశ భవిష్య త్తుకు అంతరిక్ష ప్రయోగాలు అవసరమని గుర్తించి దేశంలో స్పేస్‌ సైన్స్‌కు విత్తనం వేశారన్నారు. ఆ  విత్తే వృక్షమై నేడు దేశం మొత్తం విస్తరించి అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచదేశాలతో పోటిపడుతుం దన్నా రు.సరికొత్త ఆలోచనలు, దూరదృష్టి,  పట్టుదల కలిగిన ఎందరో శాస్త్రవేత్తలు ఇస్రోను ముందుకునడిపించారని చెప్పారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పాటు చేసుకునేలా పరిశోధనలు సాగుతున్నాయని అందుకు మీ ఆలోచనలు ఊతంకావాలని చెప్పారు.యువిక కార్యక్రమంలో నేర్చుకున్న విజ్ఞానంతో మీమీ ప్రాంతాల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులకు మీరే నాయకత్వం వహించాలని సూచించారు.అనంతరం విద్యా ర్థుల సందేహాలకు సోమనాథ్‌ సమాధానాలు ఇచ్చారు.తరువాత విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌, ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త టీకె అలెక్స్‌, ప్రధాన కార్యాలయం సీబీపీవో ఎన్‌. సుధీర్‌కుమార్‌, షార్‌ ఎంఎ్‌సఎడీడీ ఆర్‌.సెంధిల్‌కుమార్‌, ఎంఎ్‌సఏ గ్రూపు డైరెక్టర్‌ పి. గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

- సూళ్లూరుపేట


Updated Date - 2022-05-29T08:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising