ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లుగా అప్‌డేట్‌ చేయని వెబ్‌సైట్లు

ABN, First Publish Date - 2022-08-17T06:24:04+05:30

జీవోలు, ఇతర సమాచారానికి సంబంధించిన ప్రభుత్వ వెబ్‌సైట్లను మూడేళ్లుగా వైసీపీ ప్రభత్వం అప్‌డేట్‌ చేయడంలేదని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌ కుమార్‌ చెప్పారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వరుణ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వంపై తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి విమర్శ 

చిత్తూరు సిటీ, ఆగస్టు 16: జీవోలు, ఇతర సమాచారానికి సంబంధించిన ప్రభుత్వ వెబ్‌సైట్లను మూడేళ్లుగా వైసీపీ ప్రభత్వం అప్‌డేట్‌ చేయడంలేదని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌ కుమార్‌ చెప్పారు. చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన తెలుగు యువత, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నగర అధ్యక్షులు యువరాజ్‌, ప్రభుతేజతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సమాచారం దాచడంవల్ల ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇస్తుందో చెప్పాలని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో సీఎం డ్యాష్‌ బోర్డులో అన్ని శాఖలకు సంబంధించిన జీవోలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఉండేవని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం డ్యాష్‌ బోర్డుకే దిక్కులేకుండా పోయిందన్నారు. ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ, ఆరోగ్య, స్త్రీ శిశుసంక్షేమ, విద్యాశాఖ తదితరాలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో పొందుపరచడంలేదని ఆరోపించారు. కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఏ కార్పొరేషన్‌కు ఎంత నిధులు కేటాయించారు? ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేస్తారనే వివరాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్‌సైట్‌లను అప్‌డేట్‌ చేసి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-17T06:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising