ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనీబిసెంట్‌ జిల్లాగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-01-28T04:44:37+05:30

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతోపాటు దానికి అనీబిసెంట్‌ లేదా జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలని ప్రజాశాంతి పార్టీ జిల్లా కన్వీనర్‌ మాదిన భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న భాస్కర్‌, రాజేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె, జనవరి 27: మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతోపాటు దానికి అనీబిసెంట్‌ లేదా జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలని ప్రజాశాంతి పార్టీ జిల్లా కన్వీనర్‌ మాదిన భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.  గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో భాస్కర్‌ మాట్లాడారు. జిల్లాల ఏర్పా టులో ఏమాత్రం హేతుబద్దలేదని పేర్కొన్నారు. చారిత్రాక నేపథ్యమున్న మదనపల్లెను విస్మరించడం, పడమటి ప్రజలు సహించరని సూచించారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తాము స్వీకరించ బోమని తేల్చిచెప్పారు. మదనపల్లెను జిల్లా కేంద్రం కాకుంటే ఇక్కడి రాజకీయ నాయకులు భవిష్యత్తులో పడమటి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాయలసీమ అధ్యక్షుడు రంగు రాజేంద్ర మాట్లాడుతూ జిల్లాల ప్రకటనకు ముందు వందేళ్ల చరిత్రగల బీటీ కళాశాల, ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ, హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ తరపున కరపత్రాల ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది కె.కె.వెంకటకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising