ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మద్యం బ్రాండ్లపై, డిస్టలరీలపై చర్చకు సిద్దమా?: విష్ణువర్ధన్రెడ్డి

ABN, First Publish Date - 2022-08-03T17:37:27+05:30

హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి రాయలసీమ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (Chittoor): హంద్రీనీవా (Handriniva), గాలేరు (Galeru), నగరి (Nagari) వంటి రాయలసీమ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి (Vishnuvardhan Reddy) ప్రశ్నించారు. బుధవారం యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నిర్మిస్తున్న పోలవరం (Polavaram)పైనే దృష్టి కేంద్రీకరించి, చర్చలకు తావిస్తున్నారని.. కానీ ఒక్క పైసా రాష్ట్ర నిధులు పోలవరానికి కేటాయించడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం (Jagan Govt.) మైనింగ్, ల్యాండ్, ఇసుక, లిక్కర్‌లపై ఆధారపడి అవినీతికి గేట్లు తెరిచిందని, మద్యం బ్రాండ్లపై, డిస్టల్లరీలపై చర్చకు సిద్దమా? అంటూ విష్ణువర్ధన్రెడ్డి సవాల్ చేశారు.


జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలకు పేదలు వెళ్ళాలంటే జగన్ తిరిగే హెలికాఫ్టర్‌లలో వెళ్ళాలని విష్ణువర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులకు హామీలపై మతిమరుపు వచ్చిందన్నారు. మద్యపాన నిషేధం గురించి ఒక్కసారి వైసీపీ వెబ్ సైట్ చూస్తే.. అందులో ఉందని అన్నారు. కానీ రాష్ట్ర మంత్రి అమర్ నాధ్ మద్యపాన నిషేదం తమ మేనిఫెస్టోలో లేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఆదాయ మార్గాలు పెరగలేదు కానీ , ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఆదాయం మాత్రం భారీగా పెరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ పోరాడుతుందని విష్ణువర్ధన్రెడ్డి స్పష్టం చేశారు.


Updated Date - 2022-08-03T17:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising