ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులు ఫుల్‌.. కిట్లు నిల్‌

ABN, First Publish Date - 2022-01-22T06:43:58+05:30

కరోనా టెస్టుల కోసం శుక్రవారం మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రికి భారీగా జనం వచ్చారు. అయితే టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో లేవని అక్కడి సిబ్బంది అనడంతో జనం వాగ్వాదానికి దిగారు.ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది.

ఆస్పత్రి అధికారులతో వాగ్వాదానికి దిగిన ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదం 

మదనపల్లె క్రైం, జనవరి 21: కరోనా టెస్టుల కోసం శుక్రవారం మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రికి భారీగా జనం వచ్చారు. అయితే టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో లేవని అక్కడి సిబ్బంది అనడంతో జనం వాగ్వాదానికి దిగారు.ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందిన నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సాధారణ లక్షణాలున్నా టెస్టుల్లో పాజిటివ్‌ వస్తోంది ఆందోళనకు గురైన జనం టెస్టులు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి 60 నుంచి 70 మంది జనం టెస్టుల కోసం వచ్చారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 20 మందికి టెస్టులు చేసి ఆ తరువాత ఆపేశారు. దీంతో జనం వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఆంజనేయులు, ఆర్‌ఎంవో నరసింహాశాస్ర్తి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.కిట్లు అయిపోయాయని సర్ది చెప్పబోయారు.  ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ, దేవ, తిరమలప్ప అక్కడికి చేరుకుని ఆందోళన కారులకు మద్దతు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లోపు కిట్లు అందుబాటులో లేకుంటే ఆస్పత్రిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-01-22T06:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising