ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఐవోగా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకారం

ABN, First Publish Date - 2022-01-27T08:07:40+05:30

తిరుపతిలోని ప్రాంతీయ ఇంటర్‌ బోర్డు పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐవో)గా వై.వెంకటరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆర్‌ఐవోను సన్మానిస్తున్న అధ్యాపకులు, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), జనవరి 26: తిరుపతిలోని ప్రాంతీయ ఇంటర్‌ బోర్డు పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐవో)గా వై.వెంకటరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆర్‌ఐవోగా ఉన్న బాలకృష్ణమూర్తి ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యి వెంకటరెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కొత్త ఆర్‌ఐవో మాట్లాడుతూ.. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో థియరీ, ప్రయోగ తరగతుల నిర్వహణ జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి, పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా ఆర్‌ఐవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నూతన ఆర్‌ఐవోను ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నం రవి, జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ఎ.హేమలత, కోశాధికారి పి.రాజనాల, సంయుక్త కార్యదర్శి సి.వంశీకృష్ణ, ఎన్‌.జయచంద్ర, డీవీఈవో వి.శ్రీనివాసులురెడ్డి, ప్రిన్సిపాళ్ల సంఘ నాయకులు జి.రాజశేఖర్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, డీఆర్‌ జీజేఎల్‌ఏ రాష్ట్ర ఫైనాన్స్‌ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ రవికుమార్‌, పలువురు అధ్యాపకులు మర్యాద పూర్వకంగా కలసి సన్మానించారు. 

Updated Date - 2022-01-27T08:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising