ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ABN, First Publish Date - 2022-05-26T06:42:36+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్‌ చేశారు.

ర్యాలీగా వెలుతున్న ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సిటీ, మే 25: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో ప్రజలపై పన్నుల బాదుడు చాలా దారుణంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్‌ తగ్గించకపోవడం దారుణమని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, కేరళతో పోల్చితే లీటరుకు రూ.10 వరకు తక్కువగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, మాజీ మేయర్‌ కటారి హేమలత, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌ రాజ్‌, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌ యాదవ్‌, నగర అధ్యక్షుడు శంకర్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దుర్గాచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising