అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వన్నెకుల క్షత్రియ భవనం
ABN, First Publish Date - 2022-10-18T05:10:02+05:30
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. అసంపూర్తి భవనా లైతే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అటువంటి భవనాల్లో వన్నెకుల క్షత్రియ సామాజిక భవనం ఒకటి. అసంపూర్తిగా ఉన్న ఈ భవనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
నిర్మాణం పూర్తికాక పోవడంతో దుస్థితిలోకి
కుప్పం, అక్టోబరు 17: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. అసంపూర్తి భవనా లైతే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అటువంటి భవనాల్లో వన్నెకుల క్షత్రియ సామాజిక భవనం ఒకటి. అసంపూర్తిగా ఉన్న ఈ భవనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
గత తెలుగుదేశం ప్రభుత్వం కుప్పం నియోజక వర్గంలో అనేక ప్రభుత్వ శాఖలకు భవనాల నిర్మా ణం ప్రారంభించింది. అంతేకాక పలు సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించడమేకాక, భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నియోజకవర్గంలో అధిక సంఖ్యాకులైన వన్నెకుల క్షత్రియులకోసం కుప్పం- గుడుపల్లె మార్గంలో గుత్తార్లపల్లె సమీపంలో స్థలం కేటాయించింది. రూ.2 కోట్లతో సామాజిక భవనం నిర్మాణం ప్రారంభించింది. శరవే గంగా సాగుతున్న ఈ భవన నిర్మా ణం, 2019 ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. అనం తరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల మాటే ఎత్తక పోవడంతో అన్ని భవనాల నిర్మాణంలాగే వన్నెకుల క్షత్రియ సామాజిక భవన నిర్మాణం కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చం దంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాం లోనే 90 శాతం పూర్తయిన ఈ భవనం ఇప్పటికీ అలాగే అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎమ్మెల్సీ సహా కీకలమైన రాజ్యాంగ పదవులన్నీ కుప్పం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఆ సా మాజిక వర్గానికే దఖలు పడ్డాయి. అయినా భవన నిర్మాణం పూర్తి చేయడానికి ఈ ఏ ఒక్క నేత కూడా చొరవ తీసుకోవడం లేదు.
రాత్రీపగలు తేడా లేదు...
రోడ్డు మార్గానికి కొంచెం దూరంలో ఉన్న అసంపూర్ణ వన్నెకుల క్షత్రియ సామాజిక భవనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రీపగలూ తేడాలేకుండా ఈ భవనంలో తాగుబోతులు వీరవిహారం చేస్తున్నారు. భవనం నిండా తాగి పగులగొట్టి పడేసిన మందు సీసాల గాజు ముక్కలు పడివుంటున్నాయి. వీటితోపాటు గుట్కాలు, నిషేధిత మత్తు పదార్థాల ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. చీకటి పడితే మందు బాబులే కాక, ఈ భవనం వ్యభిచారానికి కూడా కేంద్రంగా మారుతోందని సమీప గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మార్గంలో మహిళలు, పిల్లలతో కలసి రావడానికి జంకుతున్నారు. కనీసం ఇప్పటికైనా వన్నెకుల క్షత్రియ భవనాన్ని పూర్తి చేసి అసాంఘిక కార్యకలాపాలను నివారించాలని, ఆ సామాజిక వర్గం వారితోపాటు పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - 2022-10-18T05:10:02+05:30 IST