ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వలసపల్లె’ నిందితుడికి రిమాండ్‌

ABN, First Publish Date - 2022-01-19T06:17:12+05:30

యువకుడి హత్య కేసులో మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి, తాలూకా సీఐ శ్రీనివాసులు చెప్పారు. మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి నిర్వహించిన పశువుల పండుగ సంబరాల్లో గ్రామానికి చెందిన తలారి సురేష్‌పై దాయాదైన తలారి చలపతి క్షణికావేశంతో వేటకొడవలితో నరికిన విషయం విదితమే.

నిందితుడి అరెస్టు చూపుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, జనవరి 18: యువకుడి హత్య కేసులో మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి, తాలూకా సీఐ శ్రీనివాసులు చెప్పారు. మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి నిర్వహించిన పశువుల పండుగ సంబరాల్లో గ్రామానికి చెందిన తలారి సురేష్‌పై దాయాదైన తలారి చలపతి క్షణికావేశంతో వేటకొడవలితో నరికిన విషయం విదితమే. కాగా మంగళవారం తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈనేపథ్యంలో సురేష్‌ పండుగ చందా ఇవ్వకపోగా, సంబరాల్లో జోక్యం చేసుకుని అన్నింటా తల దూరుస్తుండడంతో చలపతికి కోపం వచ్చింది. ఈక్రమంలో డ్యాన్స్‌ చేసేందుకు పలకలు కొట్టే విషయమై జరిగిన గొడవలో భాగంగా ఆవేశానికి గురైన చలపతి చేతిలోని కొడవలితో సురేష్‌ తల నరికాడు. ఈ మేరకు తాలూకా పోలీసులు కొడవలిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో చలపతి నేరం అంగీకరించాడు. ఈ కేసులో చలపతిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising