ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి కేసులో ఇద్దరి నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2022-07-02T06:12:38+05:30

గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

నిందితులు, గంజాయిని మీడియాకు చూపిస్తున్న సీఐ నరసింహరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20 కేజీల గంజాయి స్వాధీనం

విలేకరుల సమావేశంలో సీఐ నరసింహరాజు

చిత్తూరు, జూలై 1: గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆ వివరాలను ఒకటో పట్టణ ఎస్‌ఐ సుమన్‌, మహిళ ఎస్‌ఐ వసంతికుమారితో కలిసి సీఐ నరసింహరాజు శుక్రవారం విలేకరులకు వివరించారు. కొంత కాలంగా చిత్తూరు మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిఘా పెట్టిన పోలీసులు గురువారం చిత్తూరు రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌కు మధ్యలో గుంటూరు జిల్లా కేశవరానికి చెందిన పి. దుర్గా ప్రసాద్‌(34), చిత్తూరు నగరం జానకారపల్లెకు చెందిన పి.మణికంఠన్‌(33)లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ, గుంటూరు ప్రాంతాల నుంచి గంజాయిని రైలులో తీసుకొచ్చి మణికంఠన్‌, దుర్గాప్రసాద్‌లకు ఇవ్వగా వాటిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి ఒక్కో పొట్లం రూ.300  నుంచి రూ.500 వరకు అమ్మేవారని విచారణలో తెలిసింది. దాంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-07-02T06:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising