ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నెండేళ్ల శ్రమకు ఫలితం దక్కింది

ABN, First Publish Date - 2022-08-11T06:30:03+05:30

పన్నెండేళ్ల శ్రమకు ఫలితం దక్కిందని కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకంసాధించిన హాకీ జట్టు గోల్‌కీపర్‌ రజని సంతోషం వ్యక్తం చేశారు.

రజనీని సన్మానిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హాకీ గోల్‌కీపర్‌ రజని ఆనందం


తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 10: పన్నెండేళ్ల శ్రమకు ఫలితం దక్కిందని కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకంసాధించిన హాకీ జట్టు గోల్‌కీపర్‌ రజని సంతోషం వ్యక్తం చేశారు.బుధవారం సాయంత్రం రజని తన తల్లి తులసి, సోదరుడు మణి, కోచ్‌ ప్రసన్నకుమార్‌రెడ్డిలతో కలెక్టర్‌   వెంకట్రమణారెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ డి.కె.బాలాజీ దుశ్శాలువను కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఎర్రావారిపాలెం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రజని తిరుపతి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని అభిప్రాయపడ్డారు. సెట్విన్‌ సీఈవో మురళికృష్ణ, జిల్లా పౌరసంబధాల అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రజని మాట్లాడుతూ గత రెండు కామన్వెల్త్‌ పోటీల్లో మెడల్స్‌ రాకపోవడంతో ఈసారి కసిగా కఠోరసాధన చేశామన్నారు.మెడల్‌తోనే భారత్‌కు తిరిగిరావాలన్న ధ్యేయంతో బరిలోకి దిగామన్నారు.వచ్చే ఏడాది ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించి డైరెక్ట్‌గా ఒలంపిక్స్‌కు అర్హత సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణ, జిల్లా పౌరసంబంధాల అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising