ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోంది: వై.వి.సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2022-02-16T18:36:04+05:30

అంజనాద్రిలో ఆలయ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం అభినందనీయమని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: అంజనాద్రిలో ఆలయ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం అభినందనీయమని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ హనుమ జన్మస్థలంపై కొందరు వివాదాస్పదం చేస్తున్నారన్నారు. ఆకాశగంగలో ప్రస్తుతం ఉన్న ఆలయం అలాగానే ఉంటుందని స్పష్టం చేశారు. అంజనాదేవి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయమని తెలిపారు. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందని... అందుకే ఆకాశగంగ ప్రాంతాన్ని సుందరీకరించాలని నిర్ణయించామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామన్నారు. జమ్మూలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం నిర్మాణం సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా ఆకాశగంగ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. 

Updated Date - 2022-02-16T18:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising