రాజగోపాలనాయుడికి ఘన నివాళి
ABN, First Publish Date - 2022-10-22T06:01:08+05:30
తవణంపల్లె మండలం దిగువమాఘంలోని రాజన్నపార్కులో శుక్రవారం చిత్తూరు మాజీ ఎంపీ పాటూరు రాజగోపాలనాయుడు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
తవణంపల్లె, అక్టోబరు 21: తవణంపల్లె మండలం దిగువమాఘంలోని రాజన్నపార్కులో శుక్రవారం చిత్తూరు మాజీ ఎంపీ పాటూరు రాజగోపాలనాయుడు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజగోపాల నాయుడు విగ్రహానికి ఆయన కుమార్తె, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమరరాజ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు, అమర ఆస్పత్రి ఎండీ గౌరినేని రమాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కోలాటాలతో పాటు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల గౌరవాధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, సర్పంచి గోపి, మాజీ సర్పంచి కుమార్‌నాయుడు, గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-22T06:01:08+05:30 IST