టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుందరరావు బదిలీ
ABN, First Publish Date - 2022-11-24T01:27:52+05:30
తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు అదనపు ఎస్పీలు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందారు. పదోన్నతి పొందిన ఇద్దరు ఏఎస్పీలతోపాటు మరో నాన్ క్యాడర్ ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరీ్‌షకుమార్ గుప్తా ఉత్తర్వులు వెలువరించారు.
ఇద్దరు ఏఎస్పీలకు పదోన్నతులు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 23: తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు అదనపు ఎస్పీలు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందారు. పదోన్నతి పొందిన ఇద్దరు ఏఎస్పీలతోపాటు మరో నాన్ క్యాడర్ ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరీ్‌షకుమార్ గుప్తా ఉత్తర్వులు వెలువరించారు.తిరుపతి జిల్లా పరిపాలనా విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న ఇ. సుప్రజ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.ట్రాన్స్‌కో విజిలెన్స్ ఏఎస్పీగా పనిచేస్తున్న కె.లావణ్యలక్ష్మి నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. పదోన్నతి సందర్భంగా ఆమె బదిలీ అయినప్పటికీ... ప్రస్తుతం తిరుపతి ట్రాన్స్‌కో ఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆమెను ఆ పోస్టులో నియమించారు.ఇప్పటివరకు నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో రెడ్‌శాండిల్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా పనిచేసిన ఎం. సుందరరావును ఇంటెలిజన్స్ విభాగానికి బదిలీ చేశారు.
Updated Date - 2022-11-24T01:27:55+05:30 IST