ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్ళీ పుంజుకున్న టమోటా ధరలు

ABN, First Publish Date - 2022-05-28T05:50:40+05:30

రెండు రోజులుగా తగు ముఖం పట్టిన టమోటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.శుక్రవారం ధరలు మరింతగా పెరిగాయి. బాక్సు ధర రూ.850 నుంచి రూ.910 వరకు పలికింది.

రామకుప్పం మినీ మార్కెట్‌ యార్డులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న టమోటాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రామకుప్పం/ సోమల, మే 27:  రెండు రోజులుగా తగు ముఖం పట్టిన టమోటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. రామకుప్పం, వి.కోట. ఏడోమైలు, కుప్పం, పలమనేరు మార్కెట్లలో ఐదు రోజుల క్రితం వరకు 15 కిలోల బాక్సు రూ.1100 నుంచి రూ.1500 వరకు పలికింది.  నాలుగు రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల నుంచి జిల్లాలోని మార్కెట్లకు  టమోటాలు చేరుకోవడంతో ధరలు తుగ్గుముఖం పట్టాయి. 15కిలోల బాక్సు రూ.650 నుంచి రూ.730కి పడిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గి పోవడంతో గురువారం బాక్సు ధర రూ.700 నుంచి రూ. 750కి పెరిగింది. శుక్రవారం ధరలు మరింతగా పెరిగాయి. బాక్సు ధర రూ.850 నుంచి రూ.910 వరకు పలికింది. దిగుమతులు తగ్గిపోవడం, జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడుతుండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. రీటైల్‌ మార్కెట్‌లో కిలో టమోటా  రూ.80 నుంచి రూ.90కి చేరాయి. టమోటా ధరలు లాటరీ అన్నట్లుగానే నాలుగు రోజుల నుంచి 15కిలోల బాక్స్‌ ధర రూ.700కు చేరుకుని శుక్రవారం మళ్లీ వేగం పుంజుకుంది. పుంగనూరు మార్కెట్‌లో 15కిలోల బాక్స్‌ గరిష్ఠంగా రూ.870 పలికింది. అకాల వర్షాలతో టమోటా తోటలు దెబ్బతినడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పెద్దఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె, నాగిళ్లవారిపల్లెల నుంచి  చెన్నైకి నిత్యం ఐదు లారీల టమోటాలు రవాణా అవుతున్నాయి. 


Updated Date - 2022-05-28T05:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising