ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవేగంగా తగ్గుముఖం పట్టిన టమోటా ధరలు

ABN, First Publish Date - 2022-05-26T06:37:01+05:30

: గత వారం రోజులుగా విపరీతంగా పెరిగిన టమోటా ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి.రెండు రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో టమోటా దిగుబడులు విపరీతంగా పెరగడంతో జిల్లాలోని మార్కెట్లకు చేరుతున్నాయి.

మార్కెట్‌కు తరలించడానికి టమోటాలు సిద్దం చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతులతో...


రామకుప్పం/ సోమల, మే 25: గత వారం రోజులుగా విపరీతంగా పెరిగిన టమోటా ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. రామకుప్పం, వి.కోట, ఏడోమైలు, కుప్పం, పలమనేరు మార్కెట్లలో మూడు రోజుల క్రితం వరకు 15 కిలోల బాక్సు రూ.1100 నుంచి రూ.1500 వరకు పలికింది. గత రెండు రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో టమోటా దిగుబడులు విపరీతంగా పెరగడంతో జిల్లాలోని మార్కెట్లకు చేరుతున్నాయి. దీంతో  టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం 15కిలోల బాక్సు రూ.850 నుంచి రూ.900 వరకు పలుకగా, బుధవారం అదికాస్తా రూ.650 నుంచి రూ.730కు పడిపోయింది. సోమవారం వరకు బహిరంగ మార్కెట్‌లో వార్యపారరులు కిలో టమోటా రూ.85 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుండగా, బుధవారం రూ.60 నుంచి రూ.75కు  అమ్మారు. ఇక సోమలలో  బుధవారం  15కిలోల బాక్స్‌  రూ.750 పలికింది. ఈ నెల 7న 15కిలోల బాక్స్‌ రూ.400- 500  ధర పలకగా 10వతేదీ రూ.700లకు చేరుకుంది. 18న గరిష్ఠంగా రూ.1000కి చేరుకోగా 22న రూ.1200 పలికి రైతుల ఇంట సిరులు కురిపించింది.  అదే క్రమంలో మళ్లీ తగ్గుముఖం పట్టింది. గత నాలుగు రోజులుగా రూ.1250 పలికిన కాయలు రూ.1000, రూ.950, రూ.850, బుధవారం రూ.750కి చేరుకుంది. కాగా మరో 20 రోజుల్లో  మండలంలో విస్తారంగా సాగులో ఉన్న టమోటాలు దిగుబడులు పెరగనున్న ఉన్నాయి. కనీసం 15 కిలోల బాక్స్‌ ధర రూ.400కు నిలిచినా గిట్టుబాటు కాగలదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-05-26T06:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising