శ్రీవారి భక్తులకు టోకరా!
ABN, First Publish Date - 2022-12-07T03:19:45+05:30
తిరుమల శ్రీవారి తోమాలసేవ పేరుతో నకిలీ టికెట్లను అంటగట్టడంతో మోసపోయిన భక్తుల ఉదంతమిది. టీటీడీ విజిలెన్స్ అధికారుల కథనం మేరకు..
తోమాలసేవ నకిలీ టికెట్ల విక్రయం..
రూ.37,800తో పాటు గదులకు 20 వేలు తీసుకున్న దళారీ
తిరుమల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి తోమాలసేవ పేరుతో నకిలీ టికెట్లను అంటగట్టడంతో మోసపోయిన భక్తుల ఉదంతమిది. టీటీడీ విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన రాజే్‌షకుమార్ తన కుటుంబసభ్యులు 21 మందికి ఆర్జితసేవా టికెట్లు కావాలంటూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రమణప్రసాద్ అనే దళారీని సంప్రతించాడు. మంగళవారానికి 21 తోమాల సేవ టికెట్లు ఇస్తానని చెప్పి వారి నుంచి రూ.1,800 చొప్పున రూ.37,800 వసూలు చేసిన రమణప్రసాద్ వాట్సా్‌పలో టికెట్లను పంపాడు. ఆ టికెట్లతో మంగళవారం వేకువజామున తోమాలసేవలో పాల్గొనేందుకు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు కుటుంబీకులతో కలసి రాజే్‌షకుమార్ వచ్చాడు. క్యూకాంప్లెక్స్ సిబ్బంది టికెట్లను స్కాన్ చేయగా, ఎలాంటి వివరాలు కనిపించలేదు. దీంతో విజిలెన్స్ వింగ్ అధికారులు అనుమానంతో వాటిని పరిశీలించి పాత టికెట్లను ఎడిటింగ్ చేసినట్టుగా గుర్తించారు. అలాగే నాలుగు గదులకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు కూడా రాజే్‌షకుమార్ ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. వెంటనే భక్తుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాగే మోసం చేసి అరెస్ట్ అయిన రమణప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
12 వీఐపీ బ్రేక్ టికెట్లు రూ.48 వేలు
12 వీఐపీ బ్రేక్ టికెట్లను రూ.48 వేలకు విక్రయించిన ఘటన కూడా మంగళవారమే వెలుగు చూసింది. రామనాథ్ అనే వ్యక్తి వీఐపీ బ్రేక్ దర్శనం కావాలని హైదరాబాద్‌కు చెందిన సాయి అనే దళారీని సంప్రదించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిఽధి ద్వారా రెండు సిఫారసు లేఖలపై రూ.6 వేల విలువైన 12 వీఐపీ బ్రేక్ టికెట్లను సాయి తీసుకుని.. ఒక్కో టికెట్ రూ.4 వేల చొప్పున రూ.48 వేలకు రామ్‌నాథ్‌కు విక్రయించాడు. ఈ టికెట్లతో మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌కు వచ్చిన భక్తులను అనుమానంతో విజిలెన్స్ వింగ్ అధికారులు ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. దీంతో వారి వివరాలను నమోదు చేసుకుని తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-12-07T03:19:46+05:30 IST