నేడే రైతు భరోసా నిధులు విడుదల
ABN, First Publish Date - 2022-05-16T06:57:01+05:30
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి సోమవారం నిధులను జమచేయనున్నారు.
పూతలపట్టులో జిల్లా స్థాయి కార్యక్రమం
చిత్తూరు, మే 15: వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి సోమవారం నిధులను జమచేయనున్నారు. సీఎం జగన్ ఏలూరు నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ నిధులు విడుదల చేస్తారని కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశాన్ని పూతలపట్టు జడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తామన్నారు. 2,17,907 మంది రైతులకు.. ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున రూ.119.85 కోట్లు, ఆర్‌ఓఎ్‌ఫఆర్ పట్టాలున్న 51 మందికి రూ.7,500 చొప్పున రూ.3,82,500 కలిపి మొత్తం 2,17,958 మందికి రూ.119.89 కోట్లు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా, ఇతర ప్రజా ప్రతినిఽధులు హాజరవుతారని తెలిపారు.
Updated Date - 2022-05-16T06:57:01+05:30 IST