ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశీలనలో తిరుపతి కమిషనరేట్‌ : డీజీపీ

ABN, First Publish Date - 2022-05-22T07:21:47+05:30

తిరుపతిని పోలీస్‌ కమిషనరేట్‌గా ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో శనివారం ఎస్వీయూ సెనేట్‌ హాల్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

విశ్రాంత డీఎస్పీ రామ్మోహన్‌కు మెడల్‌ బహూకరిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, మే 21 (ఆంధ్రజ్యోతి) : తిరుపతిని పోలీస్‌ కమిషనరేట్‌గా ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో శనివారం ఎస్వీయూ సెనేట్‌ హాల్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.నేరం జరిగిన వారం లేదా పది రోజుల్లోపు ఛార్జిషీట్‌ వేసేలా కేసు పురోగతి వుండాలన్నారు. నేరాలు పెరగకుండా ప్రాథమిక దశలోనే పోలీసులు చొరవ చూపాలని సూచించారు.కానిస్టేబుల్‌ నుంచీ అందరూ విద్యావంతులే కాబట్టి నేర పరిశోధనలో సందర్భోచితంగా వ్యవహరించాలన్నారు.స్టేషన్‌లో కూర్చుని పరిశోధన చేయడం మాని, ప్రతి అధికారీ ఫీల్డ్‌ జాబ్‌ తప్పనిసరిగా చేయాలన్నారు.సెన్సిటివ్‌ కేసుల విషయంలో ఇన్వెస్టిగేటివ్‌ టీముల సంఖ్య పెంచాలని సూచించారు.ప్రతి కేసునూ కొత్త కేసుగా భావించాలే కానీ నిర్లక్ష్యం చూపరాదన్నారు. ఎక్కువగా నేరాలు జరిగే హాట్‌స్పాట్లను, అప్పుడప్పుడు జరిగే పింక్‌స్పాట్లను గుర్తించి వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచాలని సూచించారు. అనంతరం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు.చెక్‌పోస్టుల వద్ద స్మగ్లింగ్‌ అరికట్టేందుకు నిఘాను ముమ్మరం చేస్తామని చెప్పారు.విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన విశ్రాంత డీఎస్పీ రామ్మోహన్‌, రేణిగుంట సీఐ అంజుయాదవ్‌, ఏఎ్‌సఐ శ్రీధర్‌బాబు, ధనంజయ, చంద్రశేఖర్‌,శ్రీకాళహస్తి హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీధర్‌లకు డీజీపీఎస్‌ కమండేషన్‌ డిస్క్‌ మెడల్‌ను అందజేశారు.డీఐజీ రవిప్రకాష్‌, ఎస్పీలు పరమేశ్వర రెడ్డి, రిషాంత్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు, ఏఎస్పీలు సుప్రజ, కులశేఖర్‌, మునిరామయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T07:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising