ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupathi: CM Jaganను కలిసేందుకు వచ్చిన వృద్ధురాలు..చివరికి ఏమైందంటే...

ABN, First Publish Date - 2022-06-24T21:43:01+05:30

తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ (Jagan)కు చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (Tirupathi): తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ (Jagan)కు చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు (Old women) ఎర్రటి ఎండలో నాలుగు గంటలపాటు నిరీక్షించింది. అధికారులు కనికరం చూపకపోవడంతో బాధతో ఆ వృద్ధురాలు ఇంటి బాట పట్టింది. తిరుపతి జిల్లా పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధిరాలి పేరు చెంగమ్మ. తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, కాంబాకం పంచాయతీకి చెందిన నిరుపేద దళితురాలు. ఆమె పేరిట 2.94 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఇటీవల కొందరు ఆక్రమించి ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకున్నారు. దీనిపై చెంగమ్మ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అర్జీ ఇవ్వాలనుకుంది.


సీఎం జగన్ వస్తున్న విషయం తెలుసుకుని శ్రీకాళహస్తి మండలం, ఇనగళూరుకు చేరుకుంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని అధికారులను వేడుకుంది. అయినా వారు కనికరం చూపించలేదు. వయసు మీదపడినా.. ఎలాగోలా హెలిపాడ్ ప్రదేశానికి చేరుకుంది. ఉదయం 10 గంటల నుంచి సీఎం తిరిగి వెళ్లేవరకు ఎండలో కూర్చుంది. చివరికి అర్జీ ఇచ్చే అవకాశం రాకపోవడంతో కంటతడి పెట్టుకుంటూ ఇంటికి పయనమైంది.

Updated Date - 2022-06-24T21:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising