ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: జీడిపప్పు, నెయ్యి, యాలకుల్లో నాణ్యత లోపం బట్టబయలు

ABN, First Publish Date - 2022-05-29T17:12:34+05:30

టీటీడీ ప్రసాదాల్లో వినియోగిస్తున్న జీడిపప్పు, నెయ్యి, యాలకుల్లో నాణ్యత లోపం బట్టబయలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirumala: టీటీడీ (TTD) ప్రసాదాల్లో వినియోగిస్తున్న జీడిపప్పు, నెయ్యి, యాలకుల్లో నాణ్యత లోపం బట్టబయలైంది. శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే ముడిసరుకుల గోల్‌మాల్ వ్యవహారం వెలుగుచూసింది. ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి పదే పదే ఫిర్యాదులు అందడంతో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subba reddy)  చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడయింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు.. శ్రీవారిని నైవేధ్యంగా సమర్పించే ప్రసాదాన్ని అమృతంలా భావిస్తారు. ఎంతో పవిత్రంగా భావించే అన్న ప్రసాదాన్ని స్వీకరించి, లడ్డూ ప్రసాదాలను తమ ఊర్లకు తీసుకువెళతారు.


ఈ మధ్య కాలంలో లడ్డూ ప్రసాదాల నాణ్యతపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ముడిసరుకుల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూల్లో వాడే జీడిపప్పు నాశిరకంగా ఉంటోందని పలు ఫిర్యాదులందాయి. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ ఛైర్మన్ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడిపప్పు నాణ్యత బాగోలేదని ఆయన తెలుసుకున్నారు. వెంటనే జీడిపప్పు కాంట్రాక్టు రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. లడ్డూ తయారీలో ఉపయోగించే యాలకులు, నెయ్యి నాణ్యత కూడా సరిగా లేకపోవడంతో వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-29T17:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising