Tirumala : శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు
ABN, First Publish Date - 2022-12-16T07:07:18+05:30
నేటి సాయంత్రం నుంచి ధనుర్మాసం నెల ప్రారంభం కానుంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు కానుంది.
Tirumala : నేటి సాయంత్రం నుంచి ధనుర్మాసం నెల ప్రారంభం కానుంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు కానుంది. రేపటి నుంచి 14 వరకూ తిరుప్పావై పఠనం జరగనుంది. సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహించనుంది. నేడు స్వామివారి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని 63,549 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 23,919 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Updated Date - 2022-12-16T07:07:20+05:30 IST