ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓజిలి మండలంలో పులి సంచారం

ABN, First Publish Date - 2022-05-25T05:57:04+05:30

ఓజిలి మండలం భట్లకనుపూరు-పినపరియపాడు గ్రామాల సమీపంలో పులి సంచరిస్తుందన్న వదంతులపై ఈప్రాంతంలో కలకలం రేగింది.

భట్లకనుపూరు-పినపరియపాడు గ్రామాల సమీపంలో సంచరిస్తున్న పులి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓజిలి, మే 24 : ఓజిలి మండలం భట్లకనుపూరు-పినపరియపాడు గ్రామాల సమీపంలో పులి సంచరిస్తుందన్న వదంతులపై ఈప్రాంతంలో కలకలం రేగింది. ఓజిలి మండలం పినపరియపాడు నుంచి నాయుడుపేట మండలం పండ్లూరుకు వెళ్లే మార్గంలో మంగళవారం పశువుల కాపరులు పులి సంచరిస్తుండటాన్ని చూసి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి వాటిని వైరల్‌ చేశారు. ఈ ఘటనపై భట్లకనుపూరు గ్రామానికి చెందిన కొందరితో మాట్లాడగా పులి సంచరిస్తున్న విషయం వాస్తమేనంటూ తెలిపారు. గతంలో రాచపాళెంకు సమీపంలో రైల్వే ట్రాక్‌ వద్ద తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళిన ఓ వ్యక్తి పులిని చూసినట్లు, వారం కిందట ఆ ప్రాంతంలోనే చిల్లమానుచేనుకు చెందిన మరో వ్యక్తికి కూడా పులి కనిపించిందనే పుకార్లు అప్పట్లో వినిపించాయి. అయితే మంగళవారం పశువుల కాపర్లు ఏకంగా పులి సంచారం చేస్తున్న ఫొటోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఈ ఘటనలు పుకార్లు కావన్నది రుజువైంది. అటవీశాఖ అధికారులు పులి జాడలను కనిపెట్టి దానిని పట్టి ప్రజల భయాందోళనలు పోగట్టాల్సిన అవసరం ఉంది.


Updated Date - 2022-05-25T05:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising