ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ముగ్గురు బాలికలు దొరికారు!

ABN, First Publish Date - 2022-05-25T06:11:53+05:30

తిరుపతిలో రెండురోజుల క్రితం అదృశ్యమైన ముగ్గురు బాలికలను మంగళవారం వారి తల్లిదండ్రులకు పుత్తూరు పోలీసులు అప్పగించారు

చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుత్తూరు, మే 24 : తిరుపతిలో రెండురోజుల క్రితం అదృశ్యమైన ముగ్గురు బాలికలను మంగళవారం వారి తల్లిదండ్రులకు పుత్తూరు పోలీసులు అప్పగించారు.తిరుపతిలోని వేదాంతపురానికి చెందిన శాంతి(8), తేజస్విని(7), శోభారాణి(6) కనపడడం లేదని అవిలాల పోలీసులకు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ చిన్నారులు మంగళవారం పుత్తూరు రైల్వే స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ  లక్ష్మీనారాయణ వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి తిరుపతి పోలీసులకు సమాచారం అందించారు.వారిచ్చిన సమాచారంతో పుత్తూరుకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులకు వారిని అప్పగించారు.అయితే ఈ చిన్నారులు పుత్తూరుకు ఎలా చేరుకున్నారో సృష్టంగా చెప్పడం లేదు.ఇంటినుంచి ఆటోలో బస్టాండుకు చేరుకున్న చిన్నారులు బస్సెక్కి పుత్తూరుకు వెళ్లినట్టు తిరుపతి పోలీసులు చెబుతున్నారు.అలా అనుకున్నా ఈ రెండురోజులు తిండి, నిద్ర లేక ఎక్కడ వున్నారో తెలియడం లేదు.పోలీసుల పరిశోధనలోనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Updated Date - 2022-05-25T06:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising