ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకతను తెలిపే ఏవం జగత్‌

ABN, First Publish Date - 2022-01-17T05:59:44+05:30

సేంద్రియ సాగు అవశ్యకతను తెలిపే విధంగా ఏవం జగత్‌ చిత్రాన్ని తీశామని దర్శకుడు దినేష్‌ నర్రా పేర్కొన్నారు. ఆదివారం సీటీఎం రోడ్డులో ఉన్న ప్రకృతివనంలో రైతుల మధ్యన ఏవం జగత్‌ డాట్‌ కామ్‌లో చిత్రాన్ని విడుదల చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏవం జగత్‌ చిత్ర దర్శకుడు దినేష్‌, చిత్రయూనిట్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్ర దర్శకుడు దినేష్‌ నర్రా


మదనపల్లె రూరల్‌, జనవరి 16:  సేంద్రియ సాగు అవశ్యకతను తెలిపే విధంగా ఏవం జగత్‌ చిత్రాన్ని తీశామని దర్శకుడు దినేష్‌ నర్రా పేర్కొన్నారు. ఆదివారం సీటీఎం రోడ్డులో ఉన్న ప్రకృతివనంలో రైతుల మధ్యన ఏవం జగత్‌ డాట్‌ కామ్‌లో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దినేష్‌ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమాను మదనపల్లె చుట్టుపక్కల తీశామన్నారు.  రసాయన ఎరువులతో పండించిన పంటలతో మనిషి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడన్నారు. అలా కాకుండా ప్రకృతి సహజంగా, సేంద్రియ ఎరువులతో సాగుచేసి పండించిన కూరగాయలు, పప్పుదినుసులు వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. రాబోయే తరాలకు సేంద్రియ వ్యవసాయం అవశ్యకతను తెలియజేసే విధంగా చిత్రం ఉంటుందన్నారు.  నటుడు కిరణ్‌గేయ, ప్రకృతివనం నిర్వాహకుడు ఎంసీవీ ప్రసాద్‌, గణేష్‌, దినకర్‌, ఇనయసుల్తానాతో పాటు పలువురు రైతులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T05:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising