‘అమరజీవి’ త్యాగం మరువలేనిది
ABN, First Publish Date - 2022-12-16T00:51:23+05:30
రాష్ట్ర అవతరణ కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం చిత్తూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 15: రాష్ట్ర అవతరణ కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం చిత్తూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 అక్టోబరు 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరశన దీక్ష చేసి.. అమరుడయ్యారని గుర్తుచేసుకున్నారు. ‘స్పందన’ హాలులో అమరజీవి చిత్రపటానికి డీఆర్వో రాజశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమశాఖల అధికారులు నరసింహులు, రబ్బాని బాషా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రమ్య, పీఆర్ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Updated Date - 2022-12-16T00:51:25+05:30 IST