ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక రీసర్వే పనులు వేగవంతం

ABN, First Publish Date - 2022-11-30T01:59:07+05:30

ఉమ్మడి జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష రీసర్వే పనులు వేగవంతం కానున్నాయి. దీనికోసం 66 సూపర్‌ న్యూమరీ పోస్టులకు సీసీఎల్‌ఏ కమిషనర్‌ అనుమతిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 29: ఉమ్మడి జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష రీసర్వే పనులు వేగవంతం కానున్నాయి. దీనికోసం 66 సూపర్‌ న్యూమరీ పోస్టులకు సీసీఎల్‌ఏ కమిషనర్‌ అనుమతిచ్చారు. రెవెన్యూ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలకు తాత్కాలిక డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 66 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, ఇన్‌స్పెక్టర్లను తహసీల్దార్లుగా అప్‌గ్రేడ్‌ చేశారు. రీసర్వే పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో మరో ఏడాది గడువులోపు రీసర్వే పనులు సమగ్రంగా పూర్తిచేసేందుకు వీలుగా తాత్కాలిక పద్ధతిలో వీరికి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతి కాలం రెండేళ్ళుగా నిర్ణయించారు. వీరి సర్వీసును పరిగణనలోకి తీసుకోవడం జరగదని సీసీఎల్‌ఏ కమిషనర్‌ ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2022-11-30T01:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising