ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువును చెరబట్టారు

ABN, First Publish Date - 2022-08-11T06:21:55+05:30

‘అధికారం’ అండగా చెరువును చెరబట్టారు. చౌడేపల్లె మండలంలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన బుటకపల్లె చెరువును వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు.

ట్రాక్టర్‌తో దున్నిన బుటకపల్లె చెరువు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైసీపీ నాయకుల అధీనంలో 30 ఎకరాలు

 సాగులో టమోట, వరి 

 పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

చౌడేపల్లె, ఆగస్టు 10: ‘అధికారం’ అండగా చెరువును చెరబట్టారు. చౌడేపల్లె మండలంలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన బుటకపల్లె చెరువును వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. దుర్గసముద్రం పంచాయతీలోని బుటకపల్లె చెరువులో ఐదు ఎకరాలను రెండు రోజుల్లో  ఆక్రమించేశారు. సర్వే నెం.246లో 96 ఎకరాల విస్తీర్ణంలో బుటకపల్లె చెరువు ఉంది. ఈ చెరువు కింద సూమారు 300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో పంటలు సాగవుతున్నాయి. ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉండడంతో ఇక్కడ ఎకరా ధర సుమారు రూ.15లక్షల వరకు పలుకుతోంది. దీంతో కొందరు చెరువును ఆక్రమించేందుకు స్కెచ్‌ వేశారు. ఇలా 30 ఎకరాలకు పైగా కబ్జా చేసి వరి, టమోటా తదితర పంటలు సాగు చేస్తున్నారు. మరికొందరు చెరువులోనే బోర్లూ వేసి పంటల సాగు చేపట్టారు. మరి కొందరు వైసీపీ నాయకులు రెండు రోజులుగా ట్రాక్టర్‌తో దుక్కి చేస్తూ.. ఎక్స్‌కవేటరుతో చదును చేసుకుంటున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తుంది.  కలెక్టర్‌ స్పందించి చెరువు ఆక్రమణలను తొలగించాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-11T06:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising