ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలి

ABN, First Publish Date - 2022-01-22T05:39:36+05:30

గుర్రంకొండ మార్కెట్‌యార్డులో జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏవో కౌశిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రంకొండ, జనవరి 21: గుర్రంకొండ మార్కెట్‌యార్డులో జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వ్యవసాయ మండలి కమిటీ సమావేశంలో అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జాక్‌పాట్‌ విధానం రద్దయినా గుర్రంకొండలో అమలు కావడం లేదన్నారు. మార్కెట్‌ యార్డు వ్యాపారులు అధిక కమీషన్‌ వసూలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు గుర్తుచేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సరఫరా అయిన ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల సమాచారాన్ని సరిమడుగు, గుర్రంకొండ, టి.పసలవాండ్లపల్లె, నడిమికండ్రిగ, అమిలేపల్లె ఆర్బీకే సిబ్బంది తెలియజేయడం లేదని ఆయా కేంద్రాల డైరెక్టర్లు చెప్పారు. ఏవో కౌశిక, హెచ్‌వో శైలజ మాట్లాడుతూ... ఆర్బీకే సిబ్బంది సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగయ్య, డీటీ జయంతి, ముక్తార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising