ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎ్‌సఎంఈల ఏర్పాటుకు జిల్లా అనుకూలం

ABN, First Publish Date - 2022-09-25T07:25:50+05:30

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎ్‌సఎంఈ)ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని డీఆర్వో శ్రీనివాసరావు అన్నారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్వో శ్రీనివాసరావు


తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 24: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎ్‌సఎంఈ)ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని డీఆర్వో శ్రీనివాసరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బ్యాంకర్లు ఎప్పటికప్పుడు ఎంఎ్‌సఎంఈల రిజిస్ర్టేషన్‌ అయిన వాటికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. జిల్లా కొత్తగా ఏర్పడినప్పటినుంచి సింగిల్‌ డెస్క్‌ విధానంలో 293 పరిశ్రమలకు గాను 270 అనుమతులిచ్చామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కమిటీకి అందిన మేరకు 67 పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద రూ.3.37కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపామన్నారు. పి.డి.పి ప్రోగ్రాం కింద శ్రీకాళహస్తి, గుంటకిందపల్లె వద్ద కలంకారీ హ్యాండీ క్రాఫ్ట్స్‌ క్లస్టర్‌, తిరుమణ్యం వద్ద ప్రింటింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా నుంచి పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు రూ.5,593కోట్లుగా ఉందని స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని, సంబంధిత అధికారులు కూడా తరచూ సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ సరిగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమలకు కావాల్సిన నీటి సౌకర్యాలపైనా చర్చించారు. జిల్లా పరిశ్రమల అధికారి ప్రతా్‌పరెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సుభాష్‌, పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T07:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising