ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌తో దేశ రక్షణ రంగం నిర్వీర్యం

ABN, First Publish Date - 2022-06-28T06:09:37+05:30

బీజేపీ ప్రభుత్వం అపసవ్య విధానాలతో దేశ భవితను ధ్వం సం చేయడానికి కంకణం కట్టుకుందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ బి.ఆర్‌. సురేశ్‌ బాబు విమర్శించారు. అగ్నిపథ్‌ పథ కాన్ని తక్షణం ఉపసంహరించు కోవాలన్న డిమాండ్‌తో కుప్పంలో కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో సత్యాగ్రహ దీక్ష జరిగింది.

కుప్పంలో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు డాక్టర్‌ సురేశ్‌బాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, జూన్‌ 27: బీజేపీ ప్రభుత్వం అపసవ్య విధానాలతో దేశ భవితను ధ్వం సం చేయడానికి కంకణం కట్టుకుందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ బి.ఆర్‌. సురేశ్‌ బాబు విమర్శించారు. అగ్నిపథ్‌ పథకంతో దేశ రక్షణరంగం నిర్వీర్యమవుతుందని ఆం దోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ పథ కాన్ని తక్షణం ఉపసంహరించు కోవాలన్న డిమాండ్‌తో కుప్పంలో కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో సత్యాగ్రహ దీక్ష జరిగింది. ఈ సం దర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ... త్రివిధ దళాల్లో రాబోయే నాలుగేళ్లలో ఒప్పంద పద్ధతిన యువకులను చేర్చుకోవడమే అగ్నిపథ్‌ పథకం ద్వారా జరుగుతుందన్నారు. రక్షణ రం గంలో కనీవినీ ఎరుగని విధంగా ఒప్పంద ని యామకాలు జరిగితే దేశ భద్రత గాల్లో దీపమ వుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా నాలుగేళ్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసి నిరుద్యోగులుగా రోడ్లమీద అడుగు పెట్టే యువ కులకు భవిష్యత్తు ఉండదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో దేశ వినాశ నానికి దారులు వేసే క్రమంలో ఈ అగ్నిపథ్‌ ప థకం పుట్టుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ పథకం ఓ అనాలోచిత, అపరిపక్వ నిర్ణయమన్నారు. దేశ భద్రతను ప్రమాదంలో పడేసే ఎందుకూ కొర గాని అగ్నిపథ్‌ పథకంపై అధికార వైసీపీ ఎం దుకు నోరు విప్పడంలేదని నిలదీశారు. బీజేపీని చూస్తే ఎందుకంత భయమని ఎద్దేవా చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజాఉద్యమాన్ని నిర్మించి పోరాటం కొన సాగిస్తామని హెచ్చరించారు.  జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, కుప్పం నియోజకవర్గ పార్టీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising