ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: అమర్‌

ABN, First Publish Date - 2022-10-07T04:57:15+05:30

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం విజయదశమి సందర్భంగా పెద్దపంజాణి పట్టణంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రా రంభించారు.

టీడీపీ కార్యాయాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపంజాణి, అక్టోబరు 6: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం విజయదశమి సందర్భంగా పెద్దపంజాణి పట్టణంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చె బుతారన్నారు. రాజ్యాంగాన్ని అవమానించే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. అబివృద్ధిలో అట్టడుగుస్థాయిలో ఉన్నామన్నారు. నిరుద్యోగ ని ర్మూలనకు ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్‌ పేరు చెప్పగానే పక్కరాష్ట్రాలకు పరుగులు పెడుతున్నాయన్నారు. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలు బిల్లులు చెల్లించక పోవడంతో మొండి గోడలకే పరిమితమయ్యాయన్నారు. పంచాయతీ లలో అభివృద్ధి లేక, చేయడానికి నిధులు లేక సర్పంచులు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. పంచాయతీల అభి వృద్ధికి పాటు పడాల్సిన ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులనే వాడుకోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో మొదలైన పాలన అన్నింటిలో తిరోగమనంలో ఉందన్నారు. ఈ సందర్భంగా కోగిలేరు పంచాయ తీకి చెందిన 20 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.  ఆనందకుమార్‌, నాగ రాజరెడ్డి, శ్రీరాములు, సుధాకరరెడ్డి, ము రహరిరెడ్డి, వరలక్ష్మి, చెంగారెడ్డి, రోజాకృష్ణారెడ్డి, చల పతి, గంగప్ప, ముబారక్‌తాజ్‌,  సుబ్రమణ్యం, నాగ రాజ, నిరంజన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, మధు, శీనప్ప, ప్రవీణ్‌కుమార్‌, రెడ్డెప్ప, వేణు గోపాల్‌నాయుడు, వేమారెడ్డి, ధనుంజయ, హరికుమార్‌రెడ్డి, చంద్ర శేఖర్‌, బాలాజి తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T04:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising