ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం

ABN, First Publish Date - 2022-01-20T05:12:45+05:30

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉం డాలని జాయింట్‌ కలెక్టర్‌ రాజశేఖర్‌(సంక్షేమం) పేర్కొ న్నారు. తంబళ్లపల్లె పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

తంబళ్లపల్లె సీహెచ్‌సీలో సౌకర్యాలపై ఆరా తీస్తున్న జేసీ రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంబళ్లపల్లె, జనవరి 19: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉం డాలని జాయింట్‌ కలెక్టర్‌ రాజశేఖర్‌(సంక్షేమం) పేర్కొ న్నారు.  తంబళ్లపల్లె  పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను  పరిశీలించి పలు సూచనలు చేశారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లో 50 పడకలు సిద్ధం చేస్తున్నట్లు తహసీల్దారు భీమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు.  నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో వున్న బాధితుల ఇళ్ల వద్దకు ఆరోగ్య సిబ్బంది ప్రతి రోజూ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోలన్నారు.  అనంతరం తంబళ్లపల్లె సీహెచ్‌సీలోని కొవిడ్‌ వార్డులో ఆక్సిజన్‌ పడకలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, మందులు, సిబ్బంది తదితరాలపై ఆరా తీశారు.  20  ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో 10 ఆక్సిజన్‌ బెడ్లు, 13 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో వున్నట్లు డాక్టర్‌ సుబహాని తెలిపారు. ఆస్పత్రికి స్వల్ప లక్షణాలతో వచ్చే బాధితులకు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్ష నిర్వహిం చాలని సూచించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకట్రమణారెడ్డి,  ఎంపీడీవో దివాకర్‌రెడ్డి, డీటీ హరి, ఆర్‌ఐ రవినాయక్‌, వీఆర్వో శ్రీరాములు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising