ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-04-10T06:02:43+05:30

ఎస్‌ఆర్‌పురం మండలం కొటార్లపల్లెలో స్మార్ట్‌ డీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నూతన శాఖను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాఽధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ సంస్థ చైర్మన్‌ దీపక్‌కుమార్‌ తల తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న దీపక్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, ఏప్రిల్‌ 9: ఎస్‌ఆర్‌పురం మండలం కొటార్లపల్లెలో స్మార్ట్‌ డీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నూతన శాఖను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాఽధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ సంస్థ చైర్మన్‌ దీపక్‌కుమార్‌ తల  తెలిపారు. శనివారం ఏపీఎస్‌  ఆర్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డితో కలిసి  ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ సంస్థను ఏర్పాటు చేస్తే ఇక్కడి యువతకు ఉపాధి లభించడంతో పాటు జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. రీసెర్చ్‌ ఓరియంటల్‌, హార్డ్‌కోర్‌ టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి తమ సంస్థకు బెంగళూరుతో పాటు అమెరికా, చైనాలో కస్టమర్లు ఉన్నట్లు తెలిపారు.  ఐటీ సంస్థ ఏర్పాటు ద్వారా ప్రారంభంలో ఇంజనీరింగ్‌, డిప్లొమో చదివిన 500 మంది నుంచి మూడు వేల మంది వరకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.  కొటార్లపల్లె సమీపంలోని  20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న యువతకు మాత్రమే తమ సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.  తమ ట్రస్టు ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, పాఠశాలల ఏర్పాటు, ఆలయాల నిర్మాణం తదితర పనులను చేపడ తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-04-10T06:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising