చంద్రబాబుకు భారీ మెజారిటీ అందించడమే లక్ష్యం
ABN, First Publish Date - 2022-10-18T05:11:25+05:30
రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తమ పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ మెజారిటీ అందించడమే లక్ష్యంగా నేతలు చెప్పారు
రామకుప్పం, అక్టోబరు 17: రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తమ పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ మెజారిటీ అందించడమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కృషి చేస్తామని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి పట్రనారాయణా చారి, మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ చిన్నికృష్ణ చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... వైసీపీ అవినీతి, అరాచక, దౌర్జన్య పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత నెలకొందన్నారు. వైసీపీ అరాచక పాలన, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజ ల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి, గంట్లప్పగౌడు, మనోహర్, వెంకటాచలం, చంద్రశేఖర్, వెంకటరమణ, గజేంద్ర, గిరిదాసు, మునిరెడ్డి, జేయి, కామరాజనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:11:25+05:30 IST