ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా టీడీపీ సభ్యత్వ నమోదు

ABN, First Publish Date - 2022-05-16T06:26:27+05:30

వి.కోట, మే 15: మండల పరిధిలోని 18 పంచాయతీల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రనాయుడు నేతృత్వంలో తొమ్మిది బృందాలు సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాయి.

ముదరందొడ్డిలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వి.కోట, మే 15: మండల పరిధిలోని 18 పంచాయతీల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది.  పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రనాయుడు నేతృత్వంలో తొమ్మిది బృందాలు సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాయి. మండల పరిధిలో ఇప్పటి వరకు 14 వేల మంది సాధారణ సభ్యులు, మూడు వేల మంది క్రియాశీలక సభ్యులు ఉండగా, ఈ ఏడాది రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుగు యువత మండల అధ్యక్షుడు ధీరజ్‌, ఐ-టీడీపీ మండల కన్వీనర్‌ కోదండరెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని బైరుపల్లె, ముదరందొడ్డి, జవ్వునిపల్లె, కొంగాటం, పాముగానిపల్లె పంచాయతీల్లో డిజిటల్‌ సభ్యత్వ నమోదు కొనసాగించారు. వాట్సాప్‌, టెలిగ్రాం ద్వారా లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సభ్యల వివరాలను అందులో పొందుపరచి వారి ఫోన్‌లింక్‌ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నారు. చెల్లింపు పూర్తికాగానే కేంద్ర కార్యాలయం ద్వారా నేరుగా వారికే స్మార్ట్‌కార్డులు అందేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కార్యక్రమంలో  పార్టీ కార్యదర్శి ఈశ్వర్‌,  సతీష్‌, భక్తా, హరినాథరెడ్డి, గౌస్‌పీర్‌, ఉదయ్‌కుమార్‌రాజు, మురుగేష్‌, వికాస్‌రాజు, రవీంద్రారెడ్డి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T06:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising